ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక మానికి హాజరైన మంత్రి అర్జీదారుల నుంచి దరఖా స్తులు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని చెప్పారు. కాగా.. తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ టీఎస్పీటీఎంఎం ఆధ్వర్యంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాల పై పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించడం, ఓలా, ఉబర్ అక్రమ వ్యాపారాన్ని నిషేధించడం వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలో ఆటో యూనియన్లతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చారని అన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని, వాళ్ల సమస్యలు కచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆ విషయం మా దృష్టికి వచ్చిందని అన్నారు. ఆటో వాళ్లు మా సోదరులే… వాళ్లకు తప్ప కుండా న్యాయం చేస్తామని తెలిపారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు. అందరికీన్యాయం జరిగేలా ప్రభుత్వ ఆలోచన ఉంటుందని అన్నారు. ఎవరూ నిరాశపడొద్దని త్వరలోనే మీ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతామని పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *