గ్యారెంటీలను గాలికొదిలేసి…
శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు..

ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..
అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..?
కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..??

ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి
ఏర్పాట్లు చేసుకుంటున్నరా..?

గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి
రంగం సిద్ధం చేసుకుంటున్నరా..?

శ్వేత పత్రాల తమాషాలు..
పవర్ పాయింట్ షోలు దేనికోసం..?

అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి
అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి
తొండి వేషాలా..?

తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం..
తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం

శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ
ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల. శ్వేత పత్రాలే కదా..!

దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన
ప్రతి ప్రగతి నివేదిక… ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం

ఆడిట్ రిపోర్ట్‌ లు..ఆర్బీఐ నివేదికలు
ప్రతిపైసాకు  లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని
ఆవిష్కరించాయి కదా..!

ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు
ప్రచురించి..ప్రజల ముందువుంచాం..!

మేం దాచింది ఏమీలేదు..
మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..!
కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..!

మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి
దివాలాకోరు స్టొరీలు చెప్పి…తప్పించుకోవాలని చూస్తారా…?

అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు
నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..!

చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే
తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం
మీకు అలవాటే..!

అప్పుల ముచ్చట్లు చెప్పి
ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ ..!

అంచనాలు..అవగాహన లేకుండానే
అర్రాస్ పాటలు పాడినారా..?

వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను
ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే
ఈ నాటకాలు..!

మీరు ఎన్ని కథలు చెప్పినా..
మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా
ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటాం..!

ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదు..
గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని..?

కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే..
తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం..

హామీలు అమలు చేయలేకపోతే..
అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ..!!

జై తెలంగాణ… అని ట్విట్టర్ లో కేటీఆర్ గారు పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *